గ్రూప్ -1, గ్రూప్ -2 అధికారుల‌కు సీఎం దిశా నిర్దేశం

మీపై గురుత‌ర‌మైన బాధ్య‌త ఉందన్న రేవంత్ రెడ్డి

hellotelugu-CMRevanthReddy

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్ -1, గ్రూప్ -2 అధికారులుగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని రాష్ట్ర పునర్ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న యువ సోదర, సోదరీమణులతో ఈ రోజు MCRHRD ప్రాంగణంలో సమావేశమయ్యారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో యాంత్రికంగా కాదు… ఒక భావోద్వేగ బంధంతో పాల్గొన్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కాదు, ఆ యువ బృందానికి పెద్దన్నగా వెళ్లానని చెప్పారు.

పేదరికం నేపథ్యం నుంచి, తల్లిదండ్రుల చెమట బిందువుల శ్రమ నుంచి స్ఫూర్తి తీసుకుని ఈ యువ అధికారులు ఎంపికై సొంత గడ్డకు సేవ చేయబోతున్నారన్న ఆలోచన అద్వితీయమైన అనుభూతిని ఇచ్చిందని అన్నారు ముఖ్య‌మంత్రి ఎ . రేవంత్ రెడ్డి. వీళ్ల టాలెంట్ ను తక్కువ చేస్తూ, ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ కొన్ని దుష్టశక్తులు న్యాయ వ్యవస్థ ద్వారా వీళ్ల భవిష్యత్ ను చీకటి మయం చేయాలని చూశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ వారు చేసిన ప్రయత్నాలను ప్రజా ప్రభుత్వం అదే న్యాయపోరాటం ద్వారా ఎదుర్కొంద‌ని తెలిపారు. అంతే కాకుండా విజయం సాధించి, వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపిన క్రమం నాకు తృప్తిని ఇచ్చిందని స్ప‌ష్టం చేశారు సీఎం.

ఈ యువ అధికారుల బృందం “గరం, నరం, బేషరం” నానుడి తప్పు అని రుజువు చేసి, కొలువులో చేరిన నాడు ఏవిధమైన అంకిత భావంతో ఉంటారో, ఉద్యోగ విరమణ నాడు అంతే అంకిత భావంతో పేదలకు సేవ చేయాలని, చేస్తారని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

Exit mobile version