CM Revanth Reddy Important Letter : సీబీఐ విచార‌ణ కోసం కేంద్ర స‌ర్కార్ కు లేఖ

స్ప‌ష్టం చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

Hello Telugu - CM Revanth Reddy Important Letter

Hello Telugu - CM Revanth Reddy Important Letter

CM Revanth Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు శాస‌న స‌భ‌లో కాళేశ్వ‌రం క‌మిష‌న్ రిపోర్టు ఆధారంగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థతో విచార‌ణ చేప‌ట్టేందుకు సిఫార‌సు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). తాజాగా మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు విచార‌ణ నిమిత్తం కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. వెంట‌నే ద‌ర్యాప్తున‌కు ఆదేశించాల‌ని కోరారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో భారీ ఎత్తున నిధులు ఖ‌ర్చు చేసి కాళేశ్వ‌రం ప్రాజెక్టును నిర్మించారు. కేంద్ర విచారణ పారదర్శకతను నిర్ధారిస్తుందని, పక్షపాతాన్ని నివారిస్తుందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో అంతులేని అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని పేర్కొన్నారు. నిష్పాక్షికంగా వాస్త‌వాలు వెల్ల‌డి కావ‌ల‌నే ఉద్దేశంతోనే సీబీఐ తో విచార‌ణ చేప‌ట్టాల‌ని మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింద‌న్నారు సీఎం.

CM Revanth Reddy Important Letter

ప్ర‌జ‌ల‌కు కూడా తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు . ఇవాళ అధికారికంగా లేఖ రాయ‌డం జ‌రిగింద‌న్నారు రేవంత్ రెడ్డి. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ కనుగొన్న విషయాలపై దర్యాప్తులో ప్ర‌స్తావించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హ‌రీశ్ రావు, మాజీ మంత్రి, ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ లు తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు పై నివేదిక స‌మ‌ర్పించిన పీసీ ఘోష్ క‌మిష‌న్ పూర్తిగా త‌ప్పుల త‌డ‌క అంటూ మండిప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో త‌మ‌పై విచార‌ణ చేప‌ట్ట‌కుండా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు కేసీఆర్, హ‌రీశ్ రావు. ఇవాళ విచార‌ణ చేప‌ట్ట‌నుంది కోర్టు.

Also Read : AP Huge Rains : అల్ప‌పీడ‌నం ప్ర‌భావం భారీ వ‌ర్షం

Exit mobile version