CM Revanth Important Comments on Ande Sri : ముక్కోటి గొంతుక‌ల‌ను ఏకం చేసిన క‌వి అందెశ్రీ‌

ఆయ‌న ఈ లోకం ఉన్నంత దాకా బ‌తికే ఉంటాడు

Hello Telugu - CM Revanth Important Comments on Ande Sri

Hello Telugu - CM Revanth Important Comments on Ande Sri

CM Revanth : హైద‌రాబాద్ : క‌వి, గాయ‌కుడు అందెశ్రీ ఈ లోకం ఉన్నంత దాకా బ‌తికే ఉంటాడ‌ని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth). వజ్రాల గురించి దశాబ్దాలు, శతాబ్దాలు చర్చించినా కోహినూర్ వజ్రానికి పోటీ లేనట్టే.. కవులు, కళాకారులు ఎంత మంది ఉన్నా, ఎవరి గురించి చర్చించినా రేపటి తెలంగాణ చరిత్రలో అందెశ్రీ మొదటి స్థానంలో నిలబడుతారని అన్నారు. అందెశ్రీ కీర్తిని తెలంగాణ చరిత్రలో శాశ్వతం చేయడంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన అందెశ్రీ సంతాప సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

CM Revanth Reddy Key Comments on The Great Poet Ande Sri

జీవితంలో బడి ముఖమే చూడని సహజకవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ.. గీతం ఈరోజు ప్రతి బడిలో పాడుకునేంతగా యావత్ తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప కవి అని కొనియాడారు.
బడికి వెళ్లని, బడి ముఖమే చూడని అందెశ్రీ అన్న జయ జయహే తెలంగాణ.. అంటూ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపితేనే రాష్ట్ర కల నిజమైందన్నారు రేవంత్ రెడ్డి. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలే కాదు. ప్రపంచంలోని ప్రతి మూలన ఉన్న గుండెకు జయ జయహే తెలంగాణ.. చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప తెలంగాణ బిడ్డ అందెశ్రీ అని కొన‌యాడారు.

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పాడుకున్నది. కోరుకున్నదే.. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడమే కాకుండా చదువు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలని ప్రజా ప్రభుత్వం ఆ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో మొదటి అంశంగా చేర్చడం జ‌రిగింద‌ని ప్ర‌క‌టించారు సీఎం.

Also Read : Hydraa Important Meeting : ఆంజ‌నేయ గుడి, చిల్లా త‌ర‌లించేందుకు లైన్ క్లియ‌ర్

Exit mobile version