CM Revanth Reddy Strong Focus : తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ పై సీఎం ఫోకస్

ప్ర‌తిష్టాత్మకంగా నిర్వ‌హించాల‌ని ఆదేశం

Hello Telugu - CM Revanth Reddy Strong Focus

Hello Telugu - CM Revanth Reddy Strong Focus

CM Revanth Reddy : హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా హైద‌రాబాద్ లోని ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ 2025 ని నిర్వ‌హిస్తోంది. వ‌చ్చే నెల డిసెంబ‌ర్ 8,9 తేదీల‌లో రెండు రోజుల పాటు ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఇందులో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతున్న ఈ అంతర్జాతీయ సదస్సుపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన దార్శనిక పత్రం తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వ‌రుస‌గా సమావేశాలు నిర్వహించనున్నారు.

CM Revanth Reddy Focus on Raising Document

ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, 2047 నాటికి తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రంపై తుది మెరుగులు దిద్దనున్నారు. ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క‌, శ్రీ‌ధ‌ర్ బాబుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొంటారు.
మంగ‌ళ‌వారం తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిర్వ‌హించ‌గా న‌వంబ‌ర్ 26న బుధ‌వారం లాజిస్టిక్స్‌, సమ్మిట్ ఏర్పాట్లపై, 27న‌ మౌలిక వసతులు, అభివృద్ధి (పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, రవాణా, రోడ్లు – భవనాలు, ఆర్థిక, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, మున్సిపల్ వ్యవహారాలు, 28న విద్య, యువజన సంక్షేమం, (క్రీడలు, నైపుణ్యత, టూరి, 28న జం, దేవాదాయ శాఖ, 29న‌ వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమం (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ), 30న : ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమంపై స‌మావేశాలు నిర్వ‌హిస్తారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.

Also Read : CM Chandrababu Approved : ఏపీలో 3 కొత్త జిల్లాల ఏర్పాటు

Exit mobile version