CM Revanth Reddy : హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో వైపు ఇవాళ కీలకమైన బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కీలక తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఇందులో భాగంగా ఇవాళ ఆయన జూమ్ మీటింగ్ చేపట్టారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాల్లోని నాయకులతో ఇంచార్జ్ మంత్రులు అత్యవసరంగా మాట్లాడాలని ఆదేశించారు . పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేసి బీ ఫారం ఇవ్వాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy Key Comments
నో డ్యూ సర్టిపికేట్ లు ఇప్పించాలని పేర్కొన్నారు. అంతే కాకుండా లీగల్ సెల్ ను యాక్టివ్ చేయాలన్నారు సీఎం. గాంధీ భవన్ లో లీగల్ టీమ్ తో పాటు సమన్వయం కోసం ఒక టీమ్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసుపై పీసీసీ అధ్యక్షుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. కోర్టు తీర్పు తరవాత తదుపరి కార్యాచరణ కోసం రాత్రికి మరో సమావేశం ఉంటుందన్నారు. తొలి విడత కోసం రాత్రికి అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలని ఆదేశించారు. ఈసారి ఎలాగైనా అన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీనే స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వాణి మోహన్ కీలక ప్రకటన చేసింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహిస్తామని ఇప్పటికే వెల్లడించారు. ఇందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఖరారు చేశారు. ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది.
Also Read : CM Chandrababu Clear Instructions : ప్రధాని మోదీ పర్యటనను గ్రాండ్ సక్సెస్ చేయాలి : సీఎం
















