న్యూఢిల్లీ : దావోస్‌లోని జరిగిన సమావేశం తర్వాత న్యూఢిల్లీలోని ఇండియా ఇంపాక్ట్ ఏఐ సమ్మిట్‌లో మిచిగాన్‌కు చెందిన కాలిబో ఇంక్.తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది ఏపీ సర్కార్. ఈ ఆంధ్రప్రదేశ్‌లోని 50+ ఉన్నత విద్యా సంస్థలకు ఏఐ పాఠ్యాంశాలు, శాండ్‌బాక్స్ వాతావరణాలు, ఫ్యాకల్టీ అభివృద్ధి, విద్యార్థుల నైపుణ్యాలు, ఉపాధిని పెంపొందించడానికి అనువర్తిత కార్యక్రమాలతో మద్దతు ఇస్తుంది. అదనంగా గో ఏపీ, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా, కాలిబోతో రాష్ట్ర స్థాయి AI శాండ్‌బాక్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ సురక్షితమైన వాతావరణం పౌరుల అవసరాలకు మెరుగ్గా స్పందించే స్మార్ట్, వేగవంతమైన, మరింత సమర్థవంతమైన ప్రజా సేవలను రూపొందించడంలో సహాయ పడుతుంది.
ఇదిలా ఉండగా కాలిబో వ్యవస్థాపకుడు శ్రీ రాజ్ వట్టికుటి ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. మన ప్రతిభను , ప్రజా సేవలను బలోపేతం చేయడానికి మనలో ఒకరు ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని తీసుకు వస్తుండటం గర్వ కారణంగా ఉందన్నారు. ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ-NIELITతో ఒప్పందం కుదుర్చింది సర్కార్. దక్షిణ భారత్ లో మొట్టమొదటి ఏఐ, క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేలా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ప్రణాళిక తయారు చేస్తోంది.. కేంద్రం నుంచి మౌలిక సదుపాయాలకు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమి, క్వాంటం హార్డ్‌వేర్ సమకూర్చేలా ఒప్పందం చేసుకుంది సర్కార్ .
