చెన్నై : తమిళనాడులో డీఎంకే పార్టీకి పరాభవం తప్పదని జోష్యం చెప్పారు విజయ్ పార్టీ టీవీకే ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ చెన్నైలో
స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించారు. కాగా టీవీకే పార్టీ తతరపున పోటీ కూడా చేశారు. తమిళనాడు వ్యాప్తంగా సుమారు 39 స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్నాయని చెప్పారు. ప్రతి అభ్యర్థి స్ట్రాంగ్ రూమ్‌లను సందర్శించాలని సూచించడం జరిగిందన్నారు. చెన్నైలో ఇటువంటివి మూడు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. అందుకే తాము ఇక్కడికి రావడం జరిగిందన్నారు. తాము ఓట్ల లెక్కింపు రోజు కోసం వేచి చూస్తున్నామని వెల్లడించారు ఆధవ్ అర్జున. లెక్కింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా, స్పష్టంగా జరిగేలా చూడాలని మేము ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామని అన్నారు.
ఇప్పటికే ఎన్నికల సంఘానికి టీవీకే పార్టీ తరపున తమ పార్టీ చీఫ్ విజయ్ సూచనల మేరకు ఫిర్యాదు కూడా చేశామన్నారు. అలాగే శాంతిభద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించాలని కూడా కోరామని తెలిపాడు. అయితే
ప్రస్తుతానికి అంతా సవ్యంగానే సాగుతోందని తెలిపారు ఆధవ్ అర్జున. ఇదే సమయంలో ఆయన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గురించి ప్రస్తావించారు. నా దృష్టిలో ఆయన అప్పటికే ఒక మాజీ ముఖ్యమంత్రి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజలు ఆయనకు పూర్తిస్థాయి రాజకీయ విరమణను ప్రసాదించ బోతున్నారంటూ జోష్యం చెప్పారు. తాజాగా ఆధవ్ అర్జున చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో చర్చకు దారితీశాయి.
