చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా కొలువు తీరిన వెంటనే ఆయన ప్రజల ముఖ్యమంత్రిగా పేరు పొందారు. వచ్చీ రావడంతోనే తన లంచ్ బాక్సు తానే తెచ్చుకుని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. శనివారం తన కాన్వాయ్ ని తగ్గించాలని సూచించారు సీఎస్ కు. ఇదే సమయంలో ప్రజలకు మేలు చేకూరేలా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు నడుచు కోవాలని స్పష్టం చేశారు. ఎవరు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు జోసెఫ్ విజయ్. తనను కలిసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉండగా ఇవాళ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం జోసెఫ్ విజయ్. తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలలో రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజల కోసం కనీస వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అంతే కాకుండా వారిని నిల్చోబెట్ట కూడదని, కూర్చునే పనులు త్వరితగతిన చేయాలని అన్నారు సీఎం. , వారికి కూర్చునే సదుపాయం కల్పించాలన్నారు. ప్రజలతో సంభాషించేటప్పుడు అధికారులు వారిని నిలబెట్టకూడదని నొక్కి చెప్పారు సీఎం జోసెఫ్ విజయ్.
అన్ని కార్యాలయాలు తగినంత సీటింగ్ ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను సర్కార్ సమకూరుస్తుందన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో అమలు పనితీరును ఎప్పటికప్పడు కమాండ్ కంట్రోలింగ్ ద్వారా సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
