ప‌శ్చిమాసియా దేశాల‌లో తెలుగు వారిపై సీఎం ఆరా

అప్ర‌మ‌త్తంగా, క్షేమంగా ఉండాల‌న్న రేవంత్ రెడ్డి

hellotelugu-CM

హైద‌రాబాద్ : పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. యుద్ధ వాతావరణం, పలు దేశాల విమానాశ్రయాలను మూసి వేసియ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా ఇరాన్, దుబాయ్ తదితర దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల దౌత్య కార్యాలయాల మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు సీఎం. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్ప‌ష్టం చేశారు. ఈ అత్యవసర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ తో ఫోన్ లో మాట్లాడారు. భారతీయుల రక్షణ, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను, పరిస్థితులను దౌత్య కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ భారత్‌కు తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు.

ఇదిలా ఉండ‌గా మ‌రో వైపు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై యుద్దం ప్ర‌క‌టించాయి. మిస్సైల్స్ తో దాడికి దిగాయి. ఇరు దేశాల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు ఒమెన్ ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం శూన్యం. మ‌రో వైపు ప్ర‌ధాని మోదీ సైతం కొంత సంయ‌మ‌నం పాటించాల‌ని కోరారు.

Exit mobile version