CM Devendra Fadnavis Alarming : బీసీలు పాలకులుగా ఎద‌గాలి – సీఎంలు

గోవాలో ఘనంగా 10వ‌ ఓబీసీ జాతీయ మహాసభ

Hello Telugu - CM Devendra Fadnavis Alarming

Hello Telugu - CM Devendra Fadnavis Alarming

CM Devendra Fadnavis : గోవా – బీసీలు పాల‌కులుగా ఎద‌గాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు సీఎంలు దేవేంద్ర ఫ‌డ్న‌వీస్, ప్ర‌మోద్ సావంత్. గోవాలో 10వ ఓబీసీ జాతీయ మ‌హా స‌భ ఘ‌నంగా జ‌రిగింది. పలు రాష్ట్రాల మంత్రులు, అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలు,18 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు హాజరయ్యారు. దేశమంతా బిసిల వైపు చూస్తోంద‌న్నారు. కులగణనతో బీసీలకు నవ శకం రానుందన్నారు. బీసీలకు బాసటగా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. దేశంలో కులగణ‌న‌ మొదలై, బీసీల వాటా దామాషా ప్రకారం దక్కే వరకు జాతీయ స్థాయిలో బీసీల పోరు కొనసాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. బీసీల జాతీయ స్థాయి నిరంతర పోరాటం వల్ల‌నే కేంద్రం సానుకూలంగా స్పందించింద‌న్నారు. దేశ వ్యాప్తంగా బీసీలు కోరుకున్నట్టుగానే మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం 2026 నుండి దేశ వ్యాప్తంగా కులగణ‌న‌ మొదలు పెట్టనున్నదని, దేశంలో బీసీలకు నవశకం వచ్చే అవకాశం ఉందని తాను విశ్వసిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ (CM Devendra Fadnavis) అన్నారు. ఈ స‌భ‌కు రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ అధ్యక్షులు ప్రొఫెసర్ భవన్ రావు తైవాడే అధ్యక్షత వహించారు.

CM Devendra Fadnavis Key Comments

ఓబీసీ (OBC) సామాజిక వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీలకు మేలు చేయాలని ఉద్దేశంతో కేంద్ర మంత్రిత్వ శాఖలో 27 మందికి బీసీలకు అవకాశం కల్పించారని, సామాజిక న్యాయ కోణంలో దేశంలో రాష్ట్రపతులుగా బలహీన వర్గాలకు అవకాశం కల్పించార‌ని చెప్పారు సీఎం ఫ‌డ్న‌వీస్ (CM Devendra Fadnavis). మహారాష్ట్రలో కానీ ఇటు దేశవ్యాప్తంగా గాని బీసీలకు ఇంకా అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు, దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో ఓబీసీ మహాసభ దేశం గర్వించేలా నిర్వహించడం అభినందనీయం అన్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడారు. జాతీయ ఓబీసీ మహాసభను గోవాలో నిర్వహించడం అభినందనీయమని, మహాసభల ద్వారా బీసీల ఐక్యత చెంది తమకు కావలసిన వాటాను సాధించు కోవాలని సూచించారు .

తన మంత్రివర్గంలో బీసీలకు ముగ్గురికి అవకాశం కల్పించామ‌ని, బీసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అన్నారు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, గోవా కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాగూర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీసీ కులాల లెక్కలు తీసి జనాభా ఆధారంగా బీసీలకు పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ఎవరి వాటా వారికి దక్కాలన్నది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కులగణ‌న‌ జరగాలని, గల్లీ నుండి ఢిల్లీ దాకా బీసీలు పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం స్పందించింద‌న్నారు. జాతీయ స్థాయిలో కులగన మొదలు పెట్టి, వివరాలు వెల్లడించి, జనాభా దామాషా ప్రకారం, విద్యా, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ రంగాలలో రాజ్యాంగ బద్ధమైన హక్కులు దక్కే వరకు జాతీయ స్థాయిలో బీసీల పోరును కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.

Also Read : Minister Kandula Durgesh – Urban Growth : ప‌ట్ట‌ణాల అభివృద్దిపై ప్ర‌భుత్వం ఫోక‌స్

Exit mobile version