CM Chandrababu : చిత్తూరు జిల్లా – కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి అందించే కార్యక్రమాకి సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఆయన జల హారతి ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అంతకు ముందు కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్బంగా రైతులతో ముచ్చటించారు. సాగు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. చెప్పడమే కాదు.. దాన్ని చేసి చూపించాలన్న సంకల్పంతోనే రికార్డు స్థాయిలో చేపట్టిన హంద్రీ-నీవా కాల్వ విస్తరణ పనులతో సీమకు జలకళ వచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతోందని చెప్పారు సీఎం.
CM Chandrababu Key Comments
విస్తరించిన కాల్వల ద్వారా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ 19 నియోజకవర్గాలను తాకడంతో తన కల నెరవేరిందన్నారు. 10 రిజర్వాయర్‌లను నింపుతోందని చెప్పారు.. కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపురం జిల్లాలో జీడిపల్లి, పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లు ఈనీళ్లతో నిండాయయన్నారు. పూర్తిగా జల కళను సంతరించు కోవడం తనను మరింత ఆనందానికి గురి చేసిందన్నారు చంద్రబాబు నాయుడు. సత్యసాయి జిల్లాలో మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి… అన్నమయ్య జిల్లాలోని శ్రీనివాసాపురం, అడవిపల్లి రిజర్వాయర్లు నిండుతున్నాయన్నారు. అలాగే గాజుల దిన్నెకు నీరు చేరిందన్నారు.
హంద్రీనీవా ఆయకట్టులో చిట్ట చివరి జిల్లా చిత్తూరు అన్నారు. చిత్తూరు జిల్లాలో 16 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా… కేవలం 6 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోందన్నారు. మిగిలిన 10 లక్షల ఎకరాలకు సాగునీరిస్తే…రైతన్నకు నీటి కొరతే ఉండదన్నారు.
Also Read : GDP Growth : పరుగులు తీస్తున్న జీడీపీ.డీలా పడ్డ రూపాయి విలువ
