Chinta Mohan : నెల్లూరు జిల్లా – ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆర్భాటమే తప్పా సిట్ ఇప్పటి వరకు పూర్తి వివరాలు వెల్లడించ లేదని మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Chinta Mohan). ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. తాను కేంద్రంలో మంత్రిగా ఉన్న సమయంలో దేశం మొత్తానికి ఆల్కహాల్ బోర్డు కు ఒకటిన్నర సంవత్సరం చైర్మన్ గా పని చేశానని చెప్పారు . లిక్కర్ తయారీ గురించి పూర్తిగా అవగాహన ఉందన్నారు. నాలుగు కిలోల మొలాసిస్ తో ఒక లీటర్ ఆల్కహాల్ తయారు చేయొచ్చని వెల్లడించారు.లిక్కర్ స్కామ్ లో వేల కోట్లు అవినీతి జరిగిందని అంటున్నారని, మరి సిట్ ఎందుకు రిపోర్టు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు చింతా మోహన్.
Chinta Mohan Key Comments on AP Liquor Scam
తక్షణమే లిక్కర్ స్కామ్ కు సంబంధించి వాస్తవాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. నిజా నిజాలు ప్రజలకు తెలియ జేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని సైదాపురంలో లక్షల కోట్ల రూపాయలు విలువైన మైన్స్ ఉన్నాయని అన్నారు చింతా మోహన్.ఇన్నాళ్లు ఎవరు ఎత్తుకెళ్లారు? ఇప్పుడు ఎవరు ఎత్తుకెళ్తున్నారని నిలదీశారు. గూడూరు, సత్యవేడు, సూళ్లూరుపేట పరిధిలో ఇసుక ఉందని, ఎవరి చేతుల్లో ఉందో వెల్లడించాలన్నారు. దుగరాజ పట్టణ ఓడరేవు ను తాను తీసుకు వచ్చానని చెప్పారు. ఆనాడు 32 మంది కేంద్ర మంత్రులను ఒప్పించానని,. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో ఆమోద ముద్ర వేయించానని అన్నారు. దుగ్గరాజ పట్టణ ఓడరేవు పూర్తి చేసి ఉంటే లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చేవని అన్నారు. అదానికి సాయం చేసేందుకు చంద్రబాబు దానిని ఆపి పెట్టాడని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : Minister Atchannaidu Interesting Comments : వంశధార ఆయకట్టుకు సాగు నీరందించాలి
