CM Chandrababu : యుకె : లండన్ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన తన సతీమణి నారా భువనేశ్వరితో వెళ్లారు. అక్కడ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, చైర్మన్లు, సీఈఓలు, మేనేజింగ్ డైరెక్టర్లను కలుసుకున్నారు. తన పర్యటనలో భాగంగా దిగ్గజ మల్టీ నేషనల్ కంపెనీ రోల్స్ రాయస్ సంస్థ సీటీఓ నిక్కీ గ్రేడి స్మిత్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) భేటీ అయ్యారు. ఓర్వకల్లులో మిలటరీ ఎయిర్ స్ట్రిప్, విమానాల ఎంఆర్ఓ యూనిట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని ఈ సందర్బంగా వివరించారు. ఎస్ఆర్ఎం , ఎంఆర్ఎం గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరనందానీ, శామ్కో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయలతో సీఎం సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఏపీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్నారు.
CM Chandrababu Invited
పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన సహాయ, సహకారాలు అందించేందుకు తమ కూటమి సర్కార్ సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దిగ్గజ కంపెనీ గూగుల్ ఏఐ హబ్ ను ఇండియాలోని ఏపీకి చెందిన విశాఖపట్నంలో ఏర్పాటు చేసిందన్నారు. పలు మల్టీ నేషనల్ కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. అంతే కాకుండా లులూతో పాటు టీసీఎస్ ఆర్అండ్ డి సెంటర్ ను కూడా నెలకొల్పిందన్నారు. ఇదిలా ఉండగా నవంబర్ 14, 15వ తేదీలలో రెండు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా సీఐఐ సదస్సును విశాఖ వేదికగా నిర్వహిస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తలంతా విధిగా హాజరు కావాలని కోరారు సీఎం.
Also Read : TG High Court Shocking Order : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఫైర్















