CM Chandrababu : తిరుమల : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల పవిత్రత, పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపం నుండి భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి (CM Chandrababu) ప్రసంగించారు. ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశం స్వామివారు పలుమార్లు ప్రసాదించారన్నారు. అలిపిరి ఘటనలో నా ప్రాణాలను రక్షించడం కూడా ఆయన సంకల్పమేనని నేను గాఢంగా విశ్వసిస్తున్నానని చెప్పారు.
CM Chandrababu Key Comments on TTD Growth
అన్న ప్రసాదంపై మాట్లాడుతూ దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం దివంగత ఎన్.టి.రామారావు ప్రారంభించిన ఈ సత్కార్యం నేడు అనేక రెట్లు విస్తరించిందన్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందజేస్తోందని పేర్కొన్నారు. ఈ సేవను అన్ని టిటిడి ఆలయాలకు విస్తరించాలని టిటిడి చైర్మన్, బోర్డు సభ్యులు, అధికారులను సీఎం ఆదేశించారు. శ్రీవాణి ట్రస్ట్ ఇప్పటివ రకు రూ.2,038 కోట్లు విరాళాలు అందుకుందన్నారు. ఇందులో రూ.837 కోట్లు ఆలయ నిర్మాణానికి ఖర్చు చేశామన్నారు. రూ.200 కోట్లకు పైగా వడ్డీ రూపంలో కూడా వచ్చాయన్నారు. ఐదు వేల ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 29 రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని, వివిధ దేశాల్లో శ్రీవారి భక్తులు అధికంగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని సూచించారు.
Also Read : TGPSC Group-1 Final Results : టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు వెల్లడి
















