CM Chandrababu : విజయవాడ : బెజవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). ఆయన తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, ఎస్. సవిత, జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖర్ బాబు, ఆలయ కమిటీ చైర్మమన్, సభ్యులు , ఈవో శీనా నాయక్ సాదర స్వాగతం పలికారు. అమ్మ వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భవానీలు, భక్తులు పోటెత్తారు. ఇదిలా ఉండగా ఇవాళ సోమవారం అత్యంత ప్రత్యేకమైనది. శ్రీ కనకదుర్గమ్మ పుట్టిన రోజు కూడా. మూలా నక్షత్రం పురస్కరించుకుని ప్రత్యేకంగా అలంకరించారు.
CM Chandrababu Important Update
ఇక ప్రతి ఏడాతి దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మ వారు 11 రోజుల పాటు వివిధ అలంకారాలలో దర్శనం ఇస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఏపీ కూటమి సర్కార్ తరపున సీఎం నారా చంద్రబాబు నాయుడు, తన సతీమణితో కలిసి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మ వారికి ఘనంగా పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా చూడాలని దుర్గమ్మను కోరానని చెప్పారు. దసరా నవరాత్రుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు.
గుడి ప్రాంగణానికి వెళ్లగానే సామాన్య భక్తుల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక స్పందన నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. వారిలో ఉత్సాహం, సంతోషం శాశ్వతం అవ్వాలని అమ్మను కోరుకున్నానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసేలా చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని అమ్మలగన్న అమ్మను ప్రార్థించానని చెప్పారు సీఎం.
Also Read : NPCI Important Update : అక్టోబర్ 1 నుంచి దేశంలో సంచలనమైన ఆర్థిక మార్పులు



















