CM Chandrababu Warning for Cyclone : తుఫానుపై ఆందోళన వద్దు అప్రమత్తంగా ఉండాలి

ఆర్టీజీ సెంటర్ నుంచి నేరుగా అలెర్ట్ చేసే అవకాశం

Hello Telugu - CM Chandrababu Warning for Cyclone

Hello Telugu - CM Chandrababu Warning for Cyclone

CM Chandrababu : అమ‌రావ‌తి : మొంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఇవాల్టి నుంచి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. 338 మండలాలు, 3778 గ్రామాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే మొంథా తుఫానుపై (Montha Cyclone) ఆందోళన వద్దని…అప్రమత్తంగా ఉండాలని సిఎం చంద్రబాబు (CM Chandrababu) కోరారు. తుఫాను ప్రభావంపై ఆర్టీజీ సెంటర్ లో సమీక్ష చేశారు. మంత్రులు అనిత, నారా లోకేష్ తో పాటు….రియల్ టైం గవర్నెన్స్ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని సిఎం సూచించారు. అలాగే ప్రభుత్వ సన్నాహాలు, సేవలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ పని చేయాలని స్ప‌ష్టం చేశారు. ఇప్పటి వరకు తుఫాను సన్నద్దతపై ఐవిఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారం పైనా సీఎం సమీక్ష చేశారు.

CM Chandrababu Clear Instructions

అధికారులు ఎన్ని రివ్యూలు నిర్వహించారు అనేది కాదని, క్షేత్రస్థాయిలో ఎంత మేర ప్రభావం చూపిందనేది ముఖ్యమని అన్నారు సీఎం. దీనికి పబ్లిక్ పర్సెప్షన్ ను ప్రాతిపదికగా తీసుకోవాలని పేర్కొన్న‌రాఉ. తుఫానుపై ప్రభుత్వ సన్నద్దత ఎలా ఉందనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో 83 శాతం సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వివరించారు. అదే విధంగా తుఫానుకు సంబంధించిన జాగ్రత్తలపై మీమీ.. ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయా అని అంశంపై 70 శాతం మంది అవును అన్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలపై 74 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని పబ్లిక్ పర్సెప్షన్ నివేదికలు చెపుతున్నాయని వెల్ల‌డించ‌రు.

ప్రజలకు సమాచారం ఇవ్వడంతో పాటు వారి అవసరాలు, ఇబ్బందులు కూడా రియల్ టైంలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికతో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సిఎం స్ప‌ష్టం చేశారు. ప్రజలను అప్రమత్తం చేసే క్రమంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్సెమెంట్ సిస్టం ఏర్పాటు చేసినట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో మొట్టమొదటి సారిగా ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న సమాచారం ఆధారంగా ఆర్టిజీ సెంటర్ నుంచి నేరుగా ఆయా ప్రాంతాలకు మైక్ ల ద్వారా అప్రమత్తం చేసే అవకాశం ఉందన్నారు.

Also Read : TWJF State Committee Strong Demand : జర్నలిస్టులకు విరాహత్ అలీ క్షమాపణ చెప్పాలి

Exit mobile version