అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సందర్బంగా మార్కాపురంను జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని , ఆ మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు తరువాత తొలి సారి ఆ ప్రాంత పర్యటనకు వెళ్లిన నాకు జిల్లా ప్రజల స్వాగతం ఎప్పటికీ గుర్తుండి పోతుందని అన్నారు. జిల్లా ఏర్పాటుతో ప్రజల చిరకాల కోరిక తీర్చడం నాకు ఎంతో సంతృప్తి కలిగించిందని పేర్కొన్నారు. 20 నెలల కూటమి పాలనలో వారి ప్రత్యేక జిల్లా కలను నిజం చేశాం అన్నారు. వెలిగొండ పనులను వేగవంతం చేశామని స్పస్టం చేశారు.
వచ్చే జూన్ నాటికి మొదటి దశ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కరవు ప్రాంతంలో కృష్ణా జలాలు పారిస్తాం అని ప్రకటించారు. ఇందులో భాగంగా వెలిగొండ పనులను పరిశీలించి ఈ లక్ష్యాన్ని చేరుకునేలా వేగవంతంగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. రూ.456 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను ప్రారంభించడం సంతోషంగా ఉన్నారు. ప్రాజెక్టు పనులు వేగవంతం అవ్వడంపై స్థానిక ప్రజలు, రైతుల నుంచి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. సాగునీళ్లిచ్చి హార్టికల్చర్ పంటలతో ఈ ప్రాంతం రైతుల జీవన ప్రమాణాలు పెంచాలనే తమ సంకల్పానికి మద్దతుగా నిలవమని ప్రజలను కోరారు.
















