అమరావతి : ఏపీకి సంబంధించి నీటి పారుదల రంగం లో కీలక మార్పులు తీసుకు వచ్చినట్లు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఈ సంవత్సరానికి గాను ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకటించారు. .నేను కాదు… మనం అనే ముందుకు వెళ్తాం అన్నారు. టీం గా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. సిటిజెన్ సెంట్రిక్ గా సేవలు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు..ప్రతీ సోమవారం ప్రజాదర్భార్ పేరిట ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం అని, కానీ ఇక నుంచి ప్రతీ శుక్రవారం ఓ నియోజకవర్గానికి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజాదర్బార్ నిర్వహించాలని ఆదేశించారు సీఎం . పాలనలో అత్యుత్తమ విధానాలను తీసుకు వచ్చేందుకు మంత్రుల బృందాన్ని సింగపూర్ పంపించి అధ్యయనం చేయించామని చెప్పారు.
ప్రతీ కుటుంబానికి సంక్షేమం, కనీస అవసరాలు అందించేలా చర్యలు చేపట్టాం అని తెలిపారు సీఎం.
రహదారులు, వీధిలైట్లు, మురుగునీటి పారుదల వంటి వాటిని చక్కదిద్దే అంశంపై దృష్టి పెట్టాం అన్నారు.
రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాలు పెంచేలా పీ4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం అన్నారు సీఎం .
రాష్ట్ర ప్రభుత్వ పాలసీల వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు.ప్రతీ నెలా 1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు సీఎం.. 24 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
శాంతిభద్రతలు అదుపులో ఉంటే పెట్టుబడులు వస్తాయన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు. ఏపీకి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉందని, అందుకే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అనుమతులు ఇస్తున్నాం అన్నారు. ప్రాజెక్టులు వేగంగా గ్రౌండింగ్ చేయించే బాధ్యతను జిల్లా కలెక్టర్ ఎస్పీలు తీసుకోవాలన్నారు సీఎం. .మొన్నటి వరకూ ఏపీకి డేటా సెంటర్ వస్తుందని ఊహించలేదు… గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడు కోలేదన్నారు.
