CM Chandrababu : కడప జిల్లా – పర్యాటక ప్రాంతంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ప్రకటించారు. గండికోట వద్ద ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరయ్యారు. గండికోట ప్రాంతాన్ని యాంకర్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన గండికోట ప్రాంతం భారత్ గ్రాండ్ కాన్యన్ గా పేరొందిందని అన్నారు. దీంతో పాటు 13 శతాబ్దంలో కాకతీయులు నిర్మించి, ఆ తర్వాత విజయనగర రాజులు పాలించిన ఈ ప్రాంతం చారిత్రక సంపదకు ప్రతిరూపంగా ఉందని స్పష్టం చేశారు. గండికోట ప్రాంతాన్ని సాస్కీ కింద రూ.78 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
CM Chandrababu Key Updates on Gandikota
అద్భుతమైన పర్యాటక కేంద్రంగా గండికోటను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని తెలిపారు. అలాగే పర్యాటకులు బస చేసేలా స్టార్ హోటళ్ల నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పర్యాటక ప్రాంతాల్లో 50 వేల హోటల్ గదుల నిర్మాణం చేసేలా కార్యాచరణ చేపట్టామని వెల్లడించారు. టూరిస్టులను ఆకర్షించేలా గండికోట వద్ద వ్యూపాయింట్ తో పాటు, ఎకో ఫ్రెండ్లీ టెంట్ సిటీ, బోటింగ్ తో పాటు కోట వద్ద లైటింగ్ తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు సందర్శించిన వారికి మంచి అనుభూతి కలిగేలా రోప్ వే, గ్లాస్ బాటమ్ వాక్ వే, లైట్ అండ్ సౌండ్ షోలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు. ఈ ఏడాది చివరి కల్లా టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
Also Read : MLC Nagababu Alarming : ఏటికొప్పాక బొమ్మలకు గర్తింపు తీసుకొస్తాం

















