CM Chandrababu : అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మొంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాయుగుండంగా మారడంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దీంతో వెంటనే స్పందించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). సోమవారం సచివాలయంలో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. మొంథా తుపాను ప్రభావం పై సమీక్ష చేపట్టారు. ఆర్టీజీఎస్ లో అధికారులతో ఆరా తీశారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ దూరంలో మొంథా తుఫాన్ ఉందని తెలిపారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. తుపాను ప్రభావం కారణంగా ప్రత్యేక అధికారిగా అజయ్ జైన్ ను నియమించినట్లు తెలిపారు ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Key Comments
16 కి.మీ వేగంతో తీరాన్ని సమీపిస్తందని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈరోజు, రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు వస్తాయన్నారు. రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని స్పష్టం చేశారు వాతావరణ శాఖ ఎండీ. ప్రతీ గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు. మొంథా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్‌కు సీఎం సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో పాల్గొన్నారు మంత్రులు లోకేష్, వంగలపూడి అనిత, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు.
Also Read : AP High Court Clear Orders : టీటీడీ పరకామణి కేసుపై సీఐడీ దర్యాప్తు చేయాలి

















