CM Chandrababu Alarming : ప్రతీ నీటి బొట్టు సద్వినియోగం కావాలి – సీఎం

నీటితో రిజర్వాయర్లు, చెరువులు నింపండి

Hello Telugu - CM Chandrababu Interesting

Hello Telugu - CM Chandrababu Interesting

CM Chandrababu : అమరావతి – సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు సమర్ధ నీటి నిర్వహణపై జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

CM Chandrababu Key Comments on Water

ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 771 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే మధ్య స్థాయి ప్రాజెక్టుల్లో 43 టీఎంసీలు, చిన్న నీటి చెరువుల్లో 67 టీఎంసీల మేర నీరు నిల్వ ఉందని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువుల్లో 882 టీఎంసీల మేర నీరు ఉన్నట్టు వివరించారు. ఆగస్ట్ 31న కుప్పం బ్రాంచ్ కెనాల్ కు హంద్రీనీవా నీళ్లు స‌ర‌ఫ‌రా చేయాల‌ని సూచించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

ఎప్ప‌టిక‌ప్పుడు రిజ‌ర్వాయర్లను నీటితో నింపాల‌ని, ఏ ఒక్క బొట్టు కూడా వృధా కాకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం ఆ వేంక‌టేశ్వ‌రుడి ద‌య వ‌ల్ల పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని, ఎగువ‌న వ‌స్తున్న వ‌ర‌ద ఉధృతికి రాష్ట్రంలోని శ్రీ‌శైలం ప్రాజెక్టు, నాగార్జున సాగ‌ర్ , తుంగ‌భ‌ద్ర‌, సుంకేశుల, ప్ర‌కాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున నీళ్లు వ‌చ్చి చేరుతున్నాయ‌ని తెలిపారు. ఆయా జ‌లాశ‌యాల ప‌రిధిలో ఉన్న ఆయ‌క‌ట్టు చివ‌రి దాకా నీరు అందించేలా చూడాల‌ని ఆదేశించారు.

Also Read : US White House Alarming : ట్రంప్ కు శాంతి బ‌హుమ‌తి ఇవ్వాలి – లీవిట్

Exit mobile version