CM Chandrababu : అమరావతి : బహుజనుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu). ప్రధానంగా బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందని చెప్పారు. చేతి వృత్తులు, కుల వృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అండగా నిలుస్తోందన్నారు. బీసీల రక్షణ చట్టం తీసుకుని వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోందని ప్రకటించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌లను గత ప్రభుత్వం 24 శాతానికి తగ్గిస్తే తిరిగి 34 శాతానికి పెంచేలా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు సీఎం.
CM Chandrababu Key Updates
బీసీల గృహ నిర్మాణానికి అదనంగా రూ.50 వేలు, బీసీల ఇళ్లపై 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు రూ.98,000 సబ్సిడీ ఇస్తోందన్నారు. దేవాలయాల్లో పని చేస్తున్న నాయీ బ్రాహ్మణుల కనీస వేతనం రూ.25 వేలకు ప్రభుత్వం పెంచిందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడ. అలాగే ఈ వర్గాలకు దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లో చోటు కల్పించేలా నిర్ణయం తీసుకుందన్నారు. 40 వేల సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తోందన్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు కల్లు గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు, బార్‌లు కేటాయించామన్నారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేలు ఆర్ధిక సాయాన్ని ఇస్తోందన్నారు.
మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 1,29,178 మందికి రూ.259 కోట్లు అందించడం జరిగిందన్నారు సీఎం. చేనేతకు అండగా హ్యాండ్లూమ్స్‌కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ 5 శాతం రీయింబర్స్‌మెంట్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు సాయంగా ఇస్తామన్నారు.
వడ్డెరలకు మైనింగ్ లీజుల్లో 10 శాతం కేటాయింపు, కురమలు, యాదవులకు సబ్సిడీలో గొర్రెలు, మేకలు, పశువులు అందించి ఉపాథి కల్పిస్తోందన్నారు. ఎస్సీ సామాజిక వర్గాల్లో అంతరాలు తగ్గించేలా…ఏ వర్గాన్ని నొప్పించకుండా, ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్షను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఏజెన్సీ ప్రాంతాల్లో ‘అడవితల్లి బాటలో’ కార్యక్రమం ద్వారా రూ.1,000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. మైనారిటీల హక్కులు పరిరక్షిస్తూ, అవసరాలు తీరుస్తోందన్నారు. ఇమామ్‌లకు రూ.10,000, మౌజన్లకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నామన్నారు.
Also Read : CM Chandrababu Interesting Comments : సంక్షేమం కూటమి ప్రభుత్వం లక్ష్యం : సీఎం
















