CM Chandrababu Important Update : తీర ప్రాంతం ఏపీకి ఉన్న ప్ర‌ధాన‌ బలం

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కామెంట్స్

Hello Telugu - CM Chandrababu Important Update

Hello Telugu - CM Chandrababu Important Update

CM Chandrababu : ఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అన్ని రంగాల‌కు ఏపీ కేరాఫ్ గా మార‌బోతోంద‌న్నారు. తీర ప్రాంతంలో ప్రపంచ ప్రమాణాలతో పోర్టులు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ కారిడార్ల నిర్మాణం చేస్తున్నామ‌న్నారు. అడ్వాన్స్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు, రైతులకు లబ్ది కలిగేలా బిగ్ టెక్ కంపెనీలకు ఏపీ కీలక స్థానంగా మారుతోందని చెప్పారు. సెమీ కండక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులతో గ్లోబల్ టెక్ పవర్ హౌస్ గా భారత్ మారుతుందన్నారు. సహజ పర్యాటక ప్రాంతాలు ఏపీకి ఉన్న అతి పెద్ద వనరుగా ఉంద‌న్నారు. విద్య, వైద్య రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు సీఎం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని స్ప‌ష్టం చేశారు. అమెరికా తర్వాత ఇదే రెండో అతిపెద్ద కేంద్రం అవుతుందని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). ఏపీలో మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు.

CM Chandrababu Gives Key Update

ఏపీని సందర్శించిన తర్వాతే ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. పెట్టుబడులను ఆకర్షించటంలో త‌మ‌కు ప్ర‌త్యేక‌ ట్రాక్ రికార్డు ఉందన్నారు. ఐటీ రంగంతో హైదరాబాద్ ను అభివృద్ది చేసి అత్యుత్తమ నివాస నగరంగా మార్చామ‌న్నారు. ప్రస్తుతం అమరావతి నగరాన్ని గ్రీన్ సిటీగా నిర్మాణం చేస్తున్నామ‌ని చెప్పారు. అమరావతి సమీపంలో ప్రస్తుతం రోజుకు 7 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందన్నారు. కృష్ణా- గోదావరి నదులను అనుసంధానించామ‌ని పేర్కొన్నారు సీఎం. ఈ ఏడాది ఈ రెండు నదుల నుంచి 5 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందన్నారు. ప్రపంచంలోని అత్యధిక తలసరి ఆదాయం కలిగిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నార‌ని చెప్పారు. సుస్థిరమైన ప్రభుత్వాలు, సుస్థిరమైన విధానాలు దేశంలో, రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ సహా వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.

Also Read : Mallikarjun Kharge Admitted to Hospital Shocking : ఆస్ప‌త్రిలో చేరిన మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

Exit mobile version