CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమర్ధంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు జారీ చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో వివిధ అంశాలపై ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాతావరణ హెచ్చరికలు సహా 42 అంశాల్లో నిరంతర సమాచారం కోసం అవేర్ యాప్ ను ప్రజల వినియోగం కోసం విడుదల చేయాలని ఆదేశించారు. తమ కూటమి సర్కార్ వచ్చాక ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Key Comments
వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తో కలిసి గుడ్ గవర్నెన్స్ ను తీసుకు వచ్చామన్నారు. వాట్సాప్ ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని సేవలను ఉచితంగా అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా ఎలాంటి ఖర్చు లేకుండా సేవలు ప్రతి ఇంటి ముంగిటకు తీసుకు వచ్చామని తెలిపారు సీఎం. దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం టెక్నాలజీని వాడుకుంటోందని స్పష్టం చేశారు సీఎం.
Also Read : Kavitha Fired on Congress : విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని సర్కార్

















