కీల‌క అంశాల‌పై సీఎం, డిప్యూటీ సీఎం స‌మాలోచ‌న‌

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల కీల‌క భేటీపై ఉత్కంఠ‌

hellotelugu-PawanKalyaan

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్న‌ట్టుండి సీఎం చంద్ర‌బాబు నాయుడుతో భేటీ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం టీటీడీ వ్య‌వ‌హారం పీక్ కు చేరింది. ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. స‌వాళ్ల ప‌ర్వం కొన‌సాగుతోంది. మ‌రో వైపు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు రాస‌లీల‌ల‌కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన త‌ను ఇదంతా ఫేక్ వీడియోలంటూ కొట్టి పారేశారు. ఈ త‌రుణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎంతో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇదిలా ఉండగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖకి సంబంధించి చ‌ర్చించిన‌ట్లు సమాచారంం.

జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చ జ‌రిగింది.
⁠రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్స్ నిర్మించడం ద్వారా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు . నీటిపారుదలశాఖ పరిధిలోని డ్రైనేజ్ ల్లో పూడిక తీత అంశాన్ని ప్రస్తావించారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్. వేసవిలో పూడిక తీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ⁠అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను చంద్ర‌బాబుకు తెలిపారు.

Exit mobile version