హైదరాబాద్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన కామెంట్స్ పై స్పందించారు. నేనే రాజు నేనే సీఎం, ఇంకా పది సంవత్సరాలు పాటు ఉంటానని ప్రకటించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నీవు ఎవరు అలా అనడానికి అని మండిపడ్డారు. సీఎం ఎవరో నిర్ణయించేది నువ్వు కాదని, పార్టీ అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని లేక పోలే సీఎం పదవిని లాక్కుంటానని ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగారు సీఎం రేవంత్ రెడ్డి.
తాను నేనే రాజు నేనే మంత్రి అని చెప్పలేదన్నారు. తాను అన్న మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. నేనే సీఎం నేనే మున్సిపల్ శాఖ మంత్రినని మాత్రమే చెప్పానన్నారు. తాను చేసిన కామెంట్స్ పై పలువురు మంత్రులు హై కమాండ్ కు ఫిర్యాదు చేయడంతో ఖంగుతిన్నారు. చివరకు యూటర్న్ తీసుకున్నారు. తాను అలా అనలేదంటూ పేర్కొన్నారు సీఎం. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించకుండా నోటికొచ్చినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడటంపై నిలదీశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ నడుస్తుందా ? రాహుల్ కాంగ్రెస్ నడుస్తుందా అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని..ఆంధ్ర పెత్తందారుల పాలన నడుస్తోందని ఆరోపించారు.
















