CJI Suryakanth : న్యూఢిల్లీ : జస్టిస్ సూర్యకాంత్ ను చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయై వారసుడిగా నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Suryakanth) ను అధికారికంగా సిఫారసు చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రికి, కేంద్ర సర్కార్ కు, రాష్ట్రపతి ముర్ముకు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి ఏర్పాటు చేసిన విధానం ప్రకారం ఆమోదం కోసం పంపారు.సీజేఐ గవాయ్ తన తర్వాత ప్రస్తుతం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించ నున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత సీజేఐ గవాయ్ వచ్చే నెల నవంబర్ 23న అధికారికంగా పదవీ విరమణ చేయనున్నారు. 24వ తేదీన అధికారికంగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
CJI Suryakanth Promoted
జస్టిస్ సూర్యకాంత్ స్వస్థలం హర్యానా. తను మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. 38 ఏళ్ల వయసులో తను అత్యంత పిన్న వయసులో అడ్వకేట్ జనరల్ గా పని చేశాడు. 2004లో పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఓ వైపు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరో వైపు చదువు కొనసాగించారు. ఇది ఆయన ప్రత్యేకత. 2011లో కురుక్షేత్ర యూనివర్శిటీలో మాస్టార్ ఆఫ్ లాలో ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యారు జస్టిస్ సూర్యకాంత్. 14 ఏళ్ల పాటు జస్టిస్ గా పని చేశారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మే 24న 2019లో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Also Read : Hydraa- Huge Complaints : కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ
