Mohanlal : కేరళ : ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత దేశం గర్వించ దగిన సినిమా రంగానికి చెందిన అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 2023 సంవత్సరానికి తనను ఎంపిక చేసింది. ఈ సందర్బంగా ఆయన స్పందించారు. తనకు ఫాల్కే పురస్కారం ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. సినిమా అనేది శక్తివంతమైన సాధనం. వేలాది మంది ఈ రంగాన్ని నమ్ముకుని పని చేస్తున్నారు. అత్యుత్తమమైన ప్రతిభా నైపుణ్యం కలిగిన కళాకారులు ఉన్నారు. వారందరినీ కాదని తనను ఎంపిక చేయడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు మోహన్ లాల్. ఈ అత్యున్నతమైన అవార్డు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.
Mohanlal Key Comments
సినిమాకు ఎల్లలు, సరిహద్దులు అంటూ ఏవీ ఉండవన్నారు. దృశ్యం ఎక్కడికైనా , ఎవరినైనా తాకుతుందని చెప్పారు మోహన్ లాల్. ప్రధానమంత్రి కార్యాలయం నుండి అవార్డు గురించి తనకు కాల్ వచ్చినప్పుడు, తాను దానిని నమ్మలేకపోయానని నటుడు గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ గుర్తింపును సినీ పరిశ్రమ సమిష్టి కృషికి, తన కెరీర్ అంతటా ప్రేక్షకుల అచంచల మద్దతుకు సూపర్ స్టార్ అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. ఇది భారతీయ సినిమాకు చెందినది. ఈ గౌరవానికి నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏదైనా పని నిజాయితీ , అంకితభావంతో చేయాలన్నారు. ఈ మార్గంలో చాలా మంది నాకు సహాయం చేశారు. ఈ అవార్డు వారందరికీ చెందుతుందన్నారు.
Also Read : Minister Dharmendra Pradhan Fired on DMK Govt : తమిళనాడు సర్కార్ పై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్


















