Hero Chiranjeevi-Diwali Celebrations : టాలీవుడ్ స్టార్స్ దీపావ‌ళి జోష్

నాగార్జున‌, వెంక‌టేశ్ , చిరంజీవి

Hello Telugu - Hero Chiranjeevi-Diwali Celebrations

Hello Telugu - Hero Chiranjeevi-Diwali Celebrations

Chiranjeevi : హైద‌రాబాద్ : దీపావ‌ళి పండుగ‌ను పుల్ జోష్ లో జ‌రుపుకున్నారు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మ‌న్మ‌ధుడు నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేశ్ హాజ‌ర‌య్యారు. మూడు కుటుంబాల‌కు చెందిన స‌భ్యులంతా హాజ‌ర‌య్యారు. సంతోషాన్ని అనుభ‌వించారు. ఫెస్టివ‌ల్ సంద‌ర్బంగా చిరంజీవి కుటుంబం సినీ కుటుంబీకుల‌తో క‌ళ‌క‌ళ లాడింది. తెలుగు సినిమాకు మూల స్తంభాలుగా ఉంటూ వ‌చ్చారు గ‌త కొన్నేళ్లుగా మెగాస్టార్, మ‌న్మ‌థుడు, విక్ట‌రీ వెంకీ. ఈ సందర్భంగా తెలుగు వారికి, ప్ర‌ధానంగా సినీ ప్రేక్ష‌కుల‌కు, మెగా, నాగ్, విక్ట‌రీ ఫ్యాన్స్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌ధానంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి తలుపులను గొప్ప పండుగ వేడుక కోసం తెరవడంతో ఈ దీపావళి తెలుగు సినిమా సోదరులకు మరింత ప్రకాశవంతంగా మారింది.

Chiranjeevi Diwali Celebrations

చిరంజీవి సన్నిహిత పరిశ్రమ స్నేహితులు, సమకాలీనులు, విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, కింగ్ నాగార్జున అక్కినేని హాజరు కావడం తో ఇల్లంతా శోభాయ‌మానంగా, ఆహ్లాద‌క‌రంగా మారింది. ఇదిలా ఉండ‌గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌న శివశంక‌ర ప్ర‌సాద్ గారు మూవీ షూటింగ్ పూర్తి కావ‌చ్చింది. దీపావ‌ళి పండుగ సంద‌ర్బంగా మూవీ మేక‌ర్స్ ఆక‌ట్టుకునేలా పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. మెగాస్టార్ ఇంటికి వ‌చ్చారు ప్ర‌ముఖ న‌టి న‌య‌న‌తార‌. త‌ను కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఇద్ద‌రు గ‌తంలో ప‌లు సినిమాల‌లో న‌టించారు. ఇప్ప‌టికే వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చిన తాజా చిత్రంలోని సాంగ్ మంచి ఆద‌ర‌ణ చూర‌గొంది. బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది.

Also Read : CM Siddaramaiah Interesting Update : క‌ర్ణాట‌క‌లో మ‌త ఉద్రిక్త‌లు త‌గ్గించాం

Exit mobile version