Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, అందాల తార నయనతార కలిసి నటించిన చిత్రం మన శంకర వరప్రసాద్ (Chiranjeevi) గారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ , గ్లింప్స్ , పోస్టర్స్ కు మంచి ఆదరణ లభించింది. ప్రత్యేకించి సక్సెస్ పుల్ దర్శకుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి నుంచి వస్తున్న మూవీ కావడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. ఇందులో చిరంజీవిని మరింత స్టైలిష్ గా చూపించే ప్రయత్నం చేశారు. దీంతో ఫ్యాన్స్ తనను కెవ్వు కేక అంటున్నారు. ఇప్పటికే తన మాస్ లుక్ తో, స్టైల్ తో అదరగొట్టారు మెగాస్టార్. తనకు నటనా పరంగా ఎదురే లేదని చాటారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో లీనం కావడం తనకు అబ్బిన విద్య.
Chiranjeevi Digital, Satelite Movie Updates
ఇదిలా ఉండగా తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను స్వంతం చేసుకునేందుకు పలు దిగ్గజ సంస్థలు పోటీ పడ్డాయి. కానీ చివరకు భారీ ధరకు జీ నెట్ వర్క్ ఎంటర్టైన్మెంట్ చేజిక్కించు కోవడం విశేషం. ఇక మన శంకర వరప్రసాద్ గారు ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటిగా ఉంది. ఈ మూవీ వచ్చే ఏడాది 2026 సంక్రాంతి సందర్భంగా పెద్ద స్క్రీన్‌లలో విడుదల కానుంది. ఇందులో కేథరీన్ ట్రెసా కూడా కీలక పాత్రలో నటించింది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు కూడా సొంతం చేసుకుంది. షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి , సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read : MLA Anirudh Reddy Fired on Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జర నోరు జాగ్రత్త : అనిరుధ్ రెడ్డి

















