హైదరాబాద్ : మాటల మాంత్రికుడు , టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ఆదర్శ కుటుంబం. ఇందులో కీ రోల్ పోషించారు విక్టరీ వెంకటేష్ కీ రోల్ పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. విక్టరీ వెంకటేష్ నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నం: 47’ డిజిటల్ వేదికపై విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ చిత్రం నవంబర్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 30 థియేటర్లలో విడుదలైంది. ఇందులో వెంకటేష్ , శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించగా నివేదా పేతురాజ్, నారా రోహిత్, సత్య, రావు రమేష్, వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రేక్షకులు నెట్‌ఫ్లిక్స్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఈ కథ చిట్టిబాబు (వెంకటేష్) అనే మధ్యతరగతి గృహస్థుని చుట్టూ తిరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలతో సతమతమవుతున్న అతని జీవితం, అనుకోకుండా రూ. 100 కోట్ల లాటరీ గెలవడంతో ఊహించని మలుపు తిరుగుతుంది. అయి, అకస్మాత్తుగా వచ్చిన ఈ సంపద అతని కుటుంబానికి కొత్త కష్టాలను తీసుకు వస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. థియేటర్లలో ఈ సినిమాను చూడలేక పోయిన ప్రేక్షకులు, ఇప్పుడు ఓటీటీ విడుదల ద్వారా వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ఇంట్లోనే ఆస్వాదించవచ్చు.



















