Chiranjeevi : హైదరాబాద్ : దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన మెగా ఆసియా కప్ టోర్నీ 2025లో అద్బుతంగా రాణించాడు హైదరాబాద్ కు చెంతిన క్రికెటర్ తిలక్ వర్మ. దాయాది పాకిస్తాన్ టీంతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సంజూ శాంసన్, శివమ్ దూబేతో కలిసి సూపర్ షో చేశాడు. కేరళ స్టార్ 24 రన్స్ చేస్తే, దూబే 33 పరుగులతో రాణించాడు. రింకూతో కలిసి తిలక్ వర్మ 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆసియా కప్ భారత్ కైవసం చేసుకోవడంలో ముఖ్య భూమిక పోషించాడు. దేశ వ్యాప్తంగా తను స్టార్ గా మారి పోయాడు. ఇప్పటికే పలువురు తనను సత్కరించారు. అభినందనలతో ముంచెత్తారు.
Chiranjeevi Appreciated Cricketer Tilak Varma
తాజాగా గురువారం ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) డాషింగ్ క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించారు. ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. తనతో కేక్ కట్ చేయించాడు. చిరంజీవి తన బిజీ షూటింగ్ షెడ్యూల్ నుండి విరామం తీసుకుని తనను అభినందించాడు. శాలువాతో సత్కరించాడు. ప్రస్తుతం నయనతారతో కలిసి మన శివ శంకర్ ప్రసాద్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిరంజీవి. అయినా తన షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకుని స్టార్ క్రికెటర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. భవిష్యత్తులో తిలక్ వర్మ మరింతగా రాణించాలని ఆశించారు. ఈ సత్కార కార్యక్రమంలో సినీ నటులతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఉన్నారు.
Also Read : RS Praveen Kumar Fired on Congress Govt : వీళ్లు మంత్రులా వసూలు రాయుళ్లా : ఆర్ఎస్పీ

















