Chiranjeevi : హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన నటుడు కొణిదల శివ శంకర ప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). సెప్టెంబర్ 22వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే సరిగ్గా ఇదే రోజు తను నటించిన ప్రాణం ఖరీదు విడుదలైంది. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ స్వయంగా ఆనాటి జ్ఞాపకాలతో కూడిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు చిరంజీవి (Chiranjeevi). అప్పుడే తాను సినీ రంగంలోకి వచ్చేసి 47 ఏళ్ల అవుతుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చూస్తూ ఉంటేనే కాలం గడిచి పోతోందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 22, 1978వ సంవత్సరంలో తను నటించిన ప్రాణం ఖరీదు విడుదలైంది. నటుడిగా, మార్గ దర్శకుడిగా కొత్త తరానికి ఆయన స్పూర్తి దాయకంగా ఉన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పేరు పొందారు.
Chiranjeevi History
సినిమాల్లోకి తన వినయ పూర్వకమైన ప్రవేశం నుండి చిరంజీవి తెలుగు సినిమా ముఖంగా ఎదిగాడు. ప్రతి అడుగులోనూ స్టార్‌డమ్‌ను పునర్నిర్వచించాడు. అతని హై-ఎనర్జీ పెర్ఫార్మెన్స్, కామిక్ టైమింగ్ , మాస్ , క్లాస్ ప్రేక్షకులతో కనెక్ట్ అయిన తీరు తనను సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టేలా చేశాయి. తనను మెగాస్టార్ ను చేశాయి. ఆ తర్వాత కోదండరామి రెడ్డి తీసిన ఖైదీ చిరంజీవి జీవితంలోనే సూపర్ సినిమాగా నిలిచి పోయింది. సూపర్ స్టార్ డమ్ ను తెచ్చి పెట్టేలా చేసింది. ఆ తర్వాత నటించిన స్వయంకృషి, రుద్రవీణ సినిమాలు తనలోని నటుడిని పెంచేలా చేశాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, వాల్తరు వీరయ్య పేరు తీసుకు వచ్చేలా చేశాయి. తెలుగు సినిమాకే పరిమితం కాకుండా హిందీ, తమిళం, కన్నడ చిత్రాలలో కూడా తన ముద్ర వేశారు,
150 కి పైగా చిత్రాలలో నటించారు. తనకు నాలుగు నంది అవార్డులు, తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు -2006 లో పద్మభూషణ్ , 2024 లో పద్మ విభూషణ్ దక్కాయి. భారతీయ సినిమాలో బ్రేక్ డ్యాన్స్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత కూడా ఆయనది.
Also Read : OG Movie Sensational : ఓజీ సంచలనం సృష్టించడం ఖాయం
