Chinta Mohan Fired on Modi : 130వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు ప్ర‌మాదం

మోదీ, అమిత్ షా ల‌పై భ‌గ్గుమ‌న్న చింతా మోహ‌న్

Hello Telugu - Chinta Mohan Fired on Modi

Hello Telugu - Chinta Mohan Fired on Modi

Chinta Mohan : గుంటూరు జిల్లా – కేంద్ర మాజీ మంత్రి చింతామోహ‌న్ (Chinta Mohan) నిప్పులు చెరిగ‌గారు కేంద్ర స‌ర్కార్ పై. మోడీ, అమిత్ షా ఇరువురు కలిసి తీసుకొచ్చిన‌ 130 వ రాజ్యాంగ సవరణ బిల్లును ఖండిస్తున్నానని, ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని అన్నారు. ప్రతిపక్షాలను సర్వనాశనం చేసేందుకే దీనిని తీసుకు వ‌చ్చార‌ని ఆరోపించారు. శుక్ర‌వారం గుంటూరులో చింతా మోహ‌న్ మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి మంచిది కాదన్నారు. ప్రతిపక్షాలను గౌరవించి, కలుపుకుని వెళ్లాల్సిన అధికార పార్టీ, ప్రతిపక్షాలను దెబ్బ కొట్టాలని కుట్రతో ఈ బిల్లును తీసుకు రావ‌డం దారుణ‌మ‌న్నారు.

Ex Union Minister Chinta Mohan Slams Modi, Amit Shah

కమ్యూనిస్టులు ప్రతిరోజూ ప్రజా సమస్యలపై ధర్నాలు చేస్తుంటారు. 30 రోజులు జైల్లో పెట్టితే, చట్ట సభలకు ప్రాతినిత్యం కోల్పోవాలా అని ప్ర‌శ్నించారు. దేశంలో పది మంది ముఖ్యమంత్రులపై కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు పై కూడా 19 కిపైగా కేసులు ఉన్నాయి. ఎందుకు పెట్టారో నాకు తెలియదు. ఎన్నికల అఫిడవిట్లో వుంద‌న్నారు. నియంతలు ఆలోచించే ఆలోచనా విధానం కేంద్రం కలిగి ఉంద‌ని, అందుకే 130వ రాజ్యాంగ సవరణ చేశారంటూ మండిప‌డ్డారు. ప్రతిపక్షాలను దెబ్బ కొట్టే, ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు చింతా మోహ‌న్.

ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ పై వైసిపి వాళ్లు కించపరుస్తూ, వ్యక్తిగత విమర్శలు చేయ‌డం త‌గ‌ద‌న్నారు. ఆనాడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎక్క‌డ సంత‌కం పెట్టమంటే అక్క‌డ కిమ్మ‌న‌కుండా పెట్టార‌ని చివ‌ర‌కు శిక్ష అనుభ‌విస్తున్నార‌ని అన్నారు. త‌ను 22 ఏళ్ల‌కు సివిల్స్ కు ఎంపిక‌య్యార‌ని చెప్పారు. ఒక మహిళ చీర కట్టుకుంటే దానిపై కూడా విమర్శలు చేయడం బాధాకరం అన్నారు. చీఫ్ సెక్రటరీయే కాదు, క్యాబినెట్ సెక్రటరీ హోదాకి వెళ్తుందని అనుకున్నాని, అలా జరగ లేద్నారు. .రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర రాక, కష్టాలు, నష్టాలు పడుతున్నారని వాపోయారు. కూటమి ప్రభుత్వం 7000 రూపాయలు ఇచ్చింది. అది ఏ మూలకు సరిపోతుందంటూ ప్ర‌శ్నించారు.

Also Read : CM Chandrababu – New Innovation : ప‌ర్యాట‌క బ‌స్సులు పారా హుషార్

Exit mobile version