నాణ్య‌మైన విద్య‌, పౌష్టికాహారం అందించ‌డ‌మే ల‌క్ష్యం

స్ప‌ష్టం చేసిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

hellotelugu-TelanganaGovt

హైద‌రాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 100 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక మండల కేంద్రంలో నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం అని అన్నారు. ఆరుట్ల తరహాలో అన్ని రకాల వసతులతో ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు పూర్తి నివేదిక అందించాలని ఆదేశించారు. వైద్యంపై ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోందని అన్నారు. భవిష్యత్ లో అన్ని మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఇంటిగ్రేట్ చేయాలని భావిస్తున్నామని చెప్పారు సీఎం.

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.అలాంటి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు. మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టు కోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేన‌ని స్ప‌ష్టం చేశారు. మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాల‌న్నారు. ఇసుక మాఫియా , అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించక పోతే కలెక్టర్, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తాం అని హెచ్చ‌రించారు. ఈ ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తుందని, మీరు మంచి పని చేస్తే మిమ్మల్ని అభినందిస్తుందని చెప్పారు.

Exit mobile version