అమరావతి : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్ లో చోటు చేసుకకున్న బస్సు ప్రమాదంపై సిఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడి పోయింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందడం పట్ల సంతాపం తెలిపారు. బస్సు ప్రమాదం, క్షతగాత్రులకు అందుతున్న సాయంపై అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని, ఇందులో పలువురు మృతి చెందగా గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
మరికొందరిని మెరుగైన వైద్య చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులు తక్షణం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఇదిలా ఉండగా అల్లూరు సీతారామ రాజు జిల్లాలో చోటు చేసుకున్న బస్పు ప్రమాద ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
















