అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సోమవారం రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ చోటు చేసుకుంది. దీంతో చుట్టు పక్కల గ్రామాల వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న వెటనే ఆరా తీశారు నారా చంద్రబాబు నాయుడు. ఇందుకు సంబంధించి సంబంధిత మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, అధికారులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. తాము ఇప్పటికే లీకేజీ ఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడామని… సహాయ చర్యలను ముమ్మరం చేయాలని సూచించినట్టు సీఎంకు వివరించారు మంత్రులు.
ఇదిలా ఉండగా గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు మంత్రులను. ఘటనా స్థలానికి వెళ్లాలని సూచించారు. సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంటలను వెంటనే అదుపులోకి వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. జిల్లా అధికారులు, ఓఎన్జీసీ ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రులకు, అధికారులకు సీఎం సూచించారు. ఘటనకు సంబంధించిన పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పేర్కొన్నారు.















