అమరావతి : వెన్నుపోటుకు కేరాఫ్ సీఎం చంద్రబాబు నాయుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి విడదల రజని. ప్రభుత్వ అప్పులతో సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ సరదాల. కోసం ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని కృష్ణానదిలో పారిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇవాళ విడదల రజని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. త్వరలోనే ప్రజలే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో అంటేనే ఫేక్ తప్పా మరోటి కాదన్నారు. ప్రజల కష్టాలతో చలనం లేదన్నారు. అద్దాల కోసం వేల కోట్లు విడదల చేయడం దారుణం అన్నారు విడుదల రజని. వైయస్సార్సీపీని గొడ్డలి పార్టీ అంటారా? వెన్నుపోటుకు నిఘంటువు చంద్రబాబే అని పేర్కొన్నారు.
ఏడాదికి రూ. 1000 కోట్లు కేటాయించలేని ప్రభుత్వం.. అమరావతిలో వేల కోట్ల దుబారా చేస్తోందని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీని తాకట్టు పెట్టి అప్పులు తేవడం ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట అన్నారు. ప్రభుత్వ అప్పులతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల విలాసయాత్రలు చేస్తున్నారన్నారు. ఒకటో తేదీ వస్తే చాలు.. పెన్షన్ల పేరుతో షూటింగులు, స్కిట్లు చేస్తూ ఎంజాయ్ చేశారని ఆరోపించారు. నిజమైన ‘గొడ్డలి పార్టీ’ ఎవరిదో ఎన్టీఆర్, రంగా మరణాలే నిదర్శనం అన్నారు. రాష్ట్రం అప్పుల్లో మునిగితే.. కూటమి నేతలు స్పెషల్ ప్లైట్లలో విహారం చేస్తున్నారని ఇదేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు విడుదల రజని.
