ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలనంగా మారారు. తను 2027లో జరిగే ప్రపంచ కప్ లో తను ఆడే ఛాన్స్ ఎక్కువగా ఉందని టాక్. ఇదిలా ఉండగా ముంబై వేదికగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక సమావేశం నిర్వహించారు. ఈ కీలక భేటీకి అత్యంత ప్రాధాన్యత లభించింది. పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా రాబోయే సీరీస్ లు , టి20 , వన్డే , టెస్టులకు సంబంధించి వేర్వేరు టీమిండియా జట్లను ప్రకటించాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు గాను టి20, వన్డే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తో పాటు టెస్టు స్కిప్పర్ శుభ్ మన్ గిల్ కూడా హాజరయ్యారు. వీరితో పాటు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ , వీవీఎస్ లక్ష్మణ్ తో పాటు బీసీసీఐ కార్యవర్గం కూడా హాజరైంది.
ఈ సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రోహిత్ శర్మ స్థానంలో యశస్వి జైస్వాల్‌ను వన్డే జట్టుకు సంబంధించి ప్రపంచ కప్ జట్టులోకి తీసుకోవాలని గౌతమ్ గంభీర్ , చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భావించినట్లు సమాచారం. అయితే వీవీఎస్ లక్ష్మణ్, శ్రేయాస్ అయ్యర్ , కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచారు. ప్రపంచ కప్ కోసం జట్టులో రోహిత్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఉండాలని వారు కోరుకున్నారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు దేవజిత్ సైకియా కూడా ప్రపంచ కప్ విషయంలో రోహిత్ శర్మకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. అధిక శాతం మద్దతు రోహిత్ శర్మ వైపే మొగ్గు చూపడంతో ఓడీఐ రిటైర్మెంట్ అనేది చివరికి అతని సొంత నిర్ణయం కానుంది.


















