Anil Ambani Shocking : ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీపై మరో కేసు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

Hello Telugu - Anil Ambani Shocking

Hello Telugu - Anil Ambani Shocking

Anil Ambani : రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫిర్యాదు మేరకు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ మరియు ఆ కంపెనీ డైరెక్టర్ అనిల్ అంబానీపై (Anil Ambani) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

CBI Serve Notices to Anil Ambani

ఆగస్టు 21న ఎస్‌బీఐ ముంబై శాఖ సీబీఐను ఆశ్రయించి ఈ ఫిర్యాదు చేసింది. ఇందులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తప్పుడు ఖాతాలు చూపించి, మోసపూరిత పద్ధతుల్లో రూ.2,219 కోట్ల రుణం పొందిందని ఆరోపించింది. అలాగే కంపెనీ మరియు దాని డైరెక్టర్ చర్యల వల్ల బ్యాంకుకు మొత్తం రూ.2,929.05 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొంది.

ఎస్‌బీఐ అందజేసిన వివరాల ప్రకారం, ఈ రుణంలో ఇంటర్ కంపెనీ లోన్ లావాదేవీలు జరిగినట్లు, వాటిలో కొన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు ఇతర వ్యక్తులు కూడా ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తమైంది.

ఈ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ క్రిమినల్ కాన్‌స్పిరసీ, మోసం, విశ్వాసభంగం, అవినీతి నివారణ చట్టం ఉల్లంఘన వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ప్రాథమిక విచారణ అనంతరం, విస్తృత స్థాయిలో దర్యాప్తు జరిపేలా సీబీఐ ఏర్పాట్లు ప్రారంభించింది.

Also Read : Today Gold Price : తగ్గినట్టే తగ్గి దుమ్ములేపుతున్న బంగారం ధరలు

Exit mobile version