మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఫ్రెండ్లీ పోటీకి సిద్ధం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేంద్ర మంత్రి వ‌ర్మ

hellotelugu-SrinivasVarma

అమ‌రావ‌తి : కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏపీ కూట‌మి నేత‌ల‌పై భ‌గ్గుమ‌న్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఫ్రెండ్లీ పోటీకి సిద్ధంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు. సోమ‌వారం వ‌ర్మ మీడియాతో మాట్లాడారు. భీమవరం కూటమి నాయకుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి. బీజేపీకి కనీస సమాచారం ఇవ్వకుండా టీడీపీ, జనసేన సొంతంగా అభ్యర్థుల జాబితా ప్రకటించడం అవమానకరం అన్నారు. బీజేపీకి తగిన గౌరవం ఇవ్వకపోతే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు శ్రీ‌నివాస్ వ‌ర్మ‌. మొత్తం 52 వార్డుల్లో బీజేపీకి సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. ఐదు వార్డులు ఇస్తామని చెప్పి, ఆ వార్డులు ఏమిటో కూడా వారే నిర్ణయం తీసుకోవ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

నా ఇంటి పక్కన ఉన్న ఐదు వార్డులే బీజేపీకి కేటాయిస్తే ఎలా? అని అన్నారు. బీజేపీ క్యాడర్ బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు ఇవ్వాల్సిందేన‌ని పేర్కొన్నారు శ్రీ‌నివాస్ వ‌ర్మ‌. బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ తనయుడికి సైతం అవకాశం కల్పించ లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి సొంతంగా పోటీ చేసే బలం, బలగం ఉన్నాయని అన్నారు. అవసరమైతే అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు శ్రీ‌నివాస్ వ‌ర్మ‌. పొత్తులో కేటాయించే స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచి బీజేపీ సత్తా చాటగలదని పేర్కొన్నారు. 1981 నుంచి భీమవరం మున్సిపాలిటీలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ బీజేపీకి ప్రాతినిధ్యం ఉందని, ఆ విష‌యం గుర్తించాల‌న్నారు

Exit mobile version