Shubman Gill : ముంబై : దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్. తనను బీసీసీఐతో పాటు సెలెక్షన్ కమిటీ పుల్ సపోర్ట్ చేస్తున్నాయి. దీంతో మనోడు ఉన్నట్టుండి టెస్టు క్రికెట్, టి20 ఫార్మాట్ , వన్డే ఫార్మాట్ లకు ప్రమోషన్ పొందాడు. ఆస్ట్రేలియాలో జరిగే టి20 సీరీస్ కు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ కాగా వైస్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఉన్నాడు. ఇక వన్డే జట్టుకు గిల్ (Shubman Gill) స్కిప్పర్ కాగా శ్రేయాస్ అయ్యర్ ను వైస్ కెప్టెన్ చేశారు. ఇక టెస్టు జట్టుకు తనే పూర్తి స్థాయి నాయకుడిగా నియమించారు. ఇక తాజా వన్డే జట్టులోకి సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేశారు. దీంతో తమ సారథ్యంలో ఆడిన గిల్ ..కెప్టెన్సీ నాయకత్వంలో ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఆడనున్నారు.
Shubman Gill Captaincy
ఈ సందర్భంగా శుభ్ మన్ గిల్ మీడియాతో మాట్లాడాడు. తనకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం వల్ల సంతోషంగా ఉందన్నాడు. తాను అందరితో కలిసి పోతానని, మైదానం వరకే కెప్టెన్సీ అని ఆ తర్వాత అందరం ఒక్కటేనని పేర్కొన్నాడు. తన దృష్టి అంతా ఎలా గెలవాలనే దానిపై ఫోకస్ ఉంటుందన్నాడు. ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ చూసుకుంటుందని చెప్పాడు. ఇంతకంటే తాను ఎక్కువ జోక్యం చేసుకోవడానికి ఇష్ట పడనని పేర్కొన్నాడు శుభ్ మన్ గిల్. తనకు లభించిన ఆటగాళ్లంతా అద్భుతంగా ఆడే నైపుణ్యం , ప్రతిభ కలగిన వారేనని తెలిపాడు. ఇక గెలుస్తామనే నమ్మకం తో బయలు దేరుతున్నామన్నాడు ఈ యంగ్ స్కిప్పర్.
Also Read : Nobel Prize Winners : హంగేరీ రచయితకు నోబెల్ సాహిత్య పురస్కారం
