Eggs : ఆరోగ్యకరమైన ఆహారంలో గుడ్లకు ప్రత్యేక స్థానం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజూ అల్పాహారంలో గుడ్లను (Eggs) చేర్చుకోవడం శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. గుడ్లు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండటంతో పాటు బరువు నియంత్రణలో కూడా సహాయపడతాయి.
Eggs – గుండె ఆరోగ్యానికి మేలు:
గుడ్లలో ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి, రక్తప్రసరణను సక్రమంగా కొనసాగించడంలో సహాయపడతాయి. అలాగే గుడ్లలో ఉండే కోలిన్ అనే పోషకం గుండె ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గుండె సమస్యలను నివారించడంలో తోడ్పడుతుంది.
బరువు తగ్గడంలో సహాయం:
ఉదయం అల్పాహారంలో గుడ్లు తీసుకోవడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. ఫలితంగా అధికంగా తినే అలవాటు తగ్గి, బరువు తగ్గడంలో సులభతరం అవుతుంది. బరువు నియంత్రణ కోసం ప్రయత్నిస్తున్న వారు అల్పాహారంగా ఉడికించిన గుడ్లు తీసుకోవడం ఉత్తమం.
నిపుణుల సూచన:
ప్రతిరోజూ రెండు ఉడికించిన గుడ్లు అల్పాహారంలో తీసుకోవడం శరీరానికి అవసరమైన పోషకాలు అందించి, శక్తిని పెంచుతుంది. గుడ్లు పిల్లలు, యువత, పెద్దవారందరికీ సమానంగా ఉపయోగపడతాయి.
Also Read : TTD Hundi Huge Collection : అంగరంగ వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు..భారీగా శ్రీవారి హుండీ ఆదాయం



















