Nara Lokesh : బీహార్ : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) బీహార్ కు చేరుకున్నారు. శనివారం ఆయనకు ఘన స్వాగతం పలికారు స్థానిక నేతలు. లోకేష్ టీడీపీ ఎంపీలతో కలిసి బీహార్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు. దేశంలో బలమైన నాయకత్వం ఉందని, ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలిసి పోయిందన్నారు. బీహార్ రాష్ట్రంలో మరోసారి ఎన్డీయే కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడికి తనను ప్రచారం చేసేందుకు ఆహ్వానించిందుకు కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు.
Minister Nara Lokesh Key Comments
బీహార్ పారిశ్రామికవేత్తలను కలుసుకున్నానని, అంతే కాకుండా ఇక్కడి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాల్లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే రోల్ మోడల్ గా ఏపీ రాష్ట్రాన్ని తీర్చి దిద్దాలని తాము రేయింబవళ్లు కష్ట పడుతున్నామని చెప్పారు నారా లోకేష్. దేశం గర్వించ దగిన నాయకత్వం ఇప్పుడు ఉండడం 143 కోట్ల ప్రజల అదృష్టం అన్నారు. ఆరు నూరైనా సరే బీహార్ లో ఎగిరే జెండా మాత్రం తమ కూటమిదేనని స్పష్టం చేశారు. తమ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. ఇదిలా ఉండగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 12 సార్లు బీహార్ లో పర్యటించారు. ఆయనతో పాటు మరో కీలక మంత్రి అమిత్ చంద్ర షా ప్రచారంలో పాల్గొన్నారు. బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇదే సమయంలో బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ వర్సెస్ తేజస్వి యాదవ్ మధ్య పోటీ గా భావిస్తున్నారు. ఇక్కడ నువ్వా నేనా అన్న రీతిలో ఉండడంతో అందరి కళ్లు దీనిపై ఉన్నాయి. ఇక ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయింది. ఇక రెండవ విడత పోలింగ్ జరగాల్సి ఉంది.
Also Read : Rukmini Vasanth Shocking Complaint : నా పేరును దుర్వినియోగం చేస్తే చర్యలు

















