రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం న‌డుస్తోంది : కేటీఆర్

నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

hellotelugu-KTR

హైద‌రాబాద్ : రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని ధ్వ‌జ‌మెత్తారు మాజీ మంత్రి కేటీఆర్. ఇళ్లను కూలగొట్టడం, భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేయడం త‌ప్పా చేసింది ఒక్క మంచి ప‌ని లేద‌న్నారు. మూసీ పేరిట తాను చేస్తున్న స్కామ్ కోసం వేలాదిమంది ఇళ్లను రేవంత్ కూలగొడుతుండ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌జ‌లు ఏదో ఒక రోజు తిర‌గ‌బ‌డటం ఖాయ‌మ‌న్నారు. మూసీ బాధితులకు త‌మ‌ పార్టీ అండగా ఉంటుందని ప్ర‌క‌టించారు. రెండు సంవత్సరాలు మీ ఇళ్లను, భూములను కాపాడుకోవాలన‌ని, ఆ త‌ర్వాత త‌మ స‌ర్కార్ వ‌స్తుంద‌ని, మీకు అన్యాయం జ‌ర‌గ‌కుండా చూస్తామ‌న్నారు కేటీఆర్. మరో రెండేళ్లు తెలంగాణను కాంగ్రెస్ నుంచి కాపాడు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు. .

మూసీ బాధిత కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వ బెదిరింపులు ఆపాలంటూ డిమాండ్ చేవారు కేటీఆర్.
బాధిత కుటుంబాలతో ‘మూసీ దండి మార్చ్’ కార్యక్రమంలో భాగంగా మూడున్నర కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొన్నారు. వేలాదిమంది ప్రజలు, మూసీ బాధితులతో వారి ఆవేదన వింటూ ముందుకు సాగారు. ఒకవైపు దేశంలో బీజేపీ బుల్డోజర్ రాజ్యం చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటు మిగిలిన నేతలంతా చెబుతుంటే, తెలంగాణలో జరుగుతున్న ఈ బుల్డోజర్ రాజ్యాన్ని, దాని అరాచకాలను మాత్రం ఆపకుండా కాంగ్రెస్ మౌనంగా ఉందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేస్తున్న బుల్డోజర్ అరాచకాలను కేవలం రేవంత్ పంపిస్తున్న సంచుల కట్టల కోసం చూడనట్లు వదిలేస్తున్నారన్నారని ఆ రోపించారు.

Exit mobile version