హైదరాబాద్ : ప్రజల గొంతుకను వినిపిస్తున్న జర్నలిస్టులను అరెస్టు చేయడం, నిర్బంధించడం కాంగ్రెస్ నిరంకుషత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజాస్వామిక పరిరక్షణ అంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఏడవ గ్యారంటీ ఇదేనా అని నిలదీశారు. జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై శాంతియుతంగా వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన TUWJ–TJF నేతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం నేతల అరెస్టు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే జర్నలిస్టుల గొంతును పోలీసు బలగాలతో నొక్కేసే కుట్ర అని ఆయన విమర్శించారు. శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కొత్త జీవో సాకుతో జర్నలిస్టుల అక్రిడిటేషన్లలో కోత విధించడం ద్వారా ప్రభుత్వం వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు.
ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం నిరంకుశత్వానికి నిదర్శనమని ఆ్గగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్య పెట్టేందుకు ఆరు గ్యారంటీ లతో పాటు ప్రజాస్వామిక పరిరక్షణ పేరుతో ఇచ్చిన ఏడవ గ్యారెంటీ అంటే జర్నలిస్టులను అరెస్టు చేయడమేన అన్నారు. క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయాల్సింది పోయి, ఉన్న వాటిని తొలగించడం ద్వారా ప్రభుత్వం వారి ఉపాధిని ఆ, త్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని అన్నారు. మారుతి సాగర్, రమేశ్ హజారి, యోగానంద్, విష్ణువర్ధన్ రెడ్డి, రమణ కుమార్, కడకంచి వెంకట్ వంటి కీలక నేతలను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు.
