హైదరాబాద్ : రాష్ట్రంలో కేసీఆర్ తిరిగి సీఎం అయ్యే ఛాన్స్ లేదన్నారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ లో చీలక రావడం ఖాయమన్నారు. జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ చీలికకు కారణం అవుతున్నట్లు కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరికను హరీష్ రావు వ్యతిరేకిస్తున్నాడంటూ బాంబు పేల్చారు. కేటీఆర్ బతిమాలుకుని జీవన్ రెడ్డి దగ్గరకు హరీష్ రావును జగిత్యాలకు తీసుకు వెళ్లాడన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ కు జీవన్ రెడ్డి వచ్చినప్పుడు హరీష్ రావు వెళ్లలేదన్నారు. బీజేపీ నేతలతో కలిసి హరీష్ రావు రహస్యంగా ఢిల్లీ వెళ్లారనే అనుమానాలు ఉన్నాయన్నారు అద్దంకి దయాకర్.
హరీష్ రావు అలక వెనుక కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.పార్టీ లో చీలికకు హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ఢిల్లికి వెళ్లాడన్నారు. జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ లో చీలిక కారణం అవుతోందన్నారు.హరీష్ రావు నే పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి జీవన్ రెడ్డి చేరిక వల్ల జరుగుతోందన్నారు. జీవన్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ లో ముసలం మొదలైందన్నారు. జీవన్ రెడ్డి ని ఐరన్ లెగ్ గా బీఆర్ఎస్ కాార్యకర్తలు భావిస్తున్నారని పేర్కొన్నారు ప్రభుత్వ విప్. యేడాది తర్వాత బయటకు వచ్చి కేసీఆర్ జగిత్యాల సభకు వెళ్తుంటే ఆ సభకు హరీష్ రావు ఎందుకు వెళ్ల లేదని ప్రశ్నించారు. హరీష్ రావును టార్గెట్ చేసుకుని విమర్శలు చేసి కవిత పార్టీ నుంచి బయటకు వెళ్లి పోయిందన్నారు.
