హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్ ప్రత్యేక నజర్

సీనియర్ నేతలను ఇన్‌ఛార్జులుగా నియామకం

hellotelugu-KTR

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో అధికార కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచకాలు, కుట్రల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అప్రమత్తమైంది. రేపు ఎన్నికలు జరగనున్న కీలకమైన హంగ్ మున్సిపాలిటీల కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ఎన్నికల ఇన్‌ఛార్జిలను నియమించారు. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు.

స్థానికంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమ కిడ్నాప్‌లు, బెదిరింపులు, పోలీసుల దుర్వినియోగం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్, స్థానిక నాయకత్వానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ అరాచకాల నేపథ్యంలో స్థానిక నాయకత్వానికి అన్ని విధాలా అండగా నిలబడేందుకు, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున సీనియర్ నాయకులను ప్రత్యేక ఇన్‌ఛార్జులుగా పంపుతున్నట్లు ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు వెంటనే తమకు కేటాయించిన మున్సిపాలిటీలకు బయలుదేరి వెళ్లారు.

Exit mobile version