BRS Party Sensational Protest : 9న బీఆర్ఎస్ పార్టీ ఛ‌లో బ‌స్ భ‌వ‌న్

పిలుపునిచ్చిన పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

Hello Telugu - BRS Party Sensational Protest

Hello Telugu - BRS Party Sensational Protest

BRS Party : హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే ప్ర‌యాణీకుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఉన్న ప‌ళంగా హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల‌లో నిత్యం న‌డిచే సిటీ బ‌స్సుల‌లో భారీ ఎత్తున ఛార్జీల‌ను పెంచింది. మ‌రో వైపు ఆర్టీసీని లోపాయికారీగా ప్రైవేట్ ప‌రం చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోందంటూ మండిప‌డింది భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ (బీఆర్ఎస్). ఈ మేర‌కు అక్టోబ‌ర్ 9వ తేదీన హైద‌రాబాద్ లోని ఆర్టీసికి చెందిన బ‌స్ భ‌వ‌న్ వ‌ర‌కు ఛ‌లో బ‌స్ భ‌వ‌న్ కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

BRS Party Protest

ఆయా ప్రాంతాల నుండి బస్ భవన్‌కు చేరుకొని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి వినతి పత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఇవ్వ‌నుంద‌ని తెలిపారు. నందినగర్ నుండి బస్సులో తాను వెళ‌తాన‌ని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ . అంతే కాకుండా మెహదీపట్నం నుండి మాజీ మంత్రి హరీష్ రావు బ‌స్ భ‌వ‌న్ కు వెళ‌తార‌ని పేర్కొన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలోని , న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో బస్ భవన్‌కు చేరుకుంటార‌ని తెలిపారు. కాగా హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు బ‌స్సుల‌లో ప్ర‌యాణం చేసి బ‌స్ భ‌వ‌న్ కు భారీగా చేరుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

Also Read : TVK Vijay Huge Support – Karur Victims : క‌రూర్ బాధితుల‌కు ద‌ళ‌ప‌తి విజ‌య్ భ‌రోసా

Exit mobile version