Brahmanandam : హైదరాబాద్ – దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్. నారాయణ మూర్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam). తను తాజాగా తీసిన యూనివర్శిటీ పేపర్ లీక్ మూవీ ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము మారినా, సినిమా రంగంలో ఎందరో మారినా తను మాత్రం మారలేదన్నారు. అవే దుస్తులు, అవే చెప్పులు, అదే ఆటో ఉందన్నారు. అప్పట్లో ఎక్కడెక్కడి నుంచో మన దేశానికి వచ్చి చదువు కొనేవారు. ఈరోజు మన దేశ విద్యా వ్యవస్థ పూర్తిగా మారి పోయిందన్నారు. అది ఎలా ఉంది అనే అంశంపై తమ్ముడు నారాయణమూర్తి రూపొందించిన గొప్ప చిత్రం ఇది అంటూ ప్రశంసించారు బ్రహ్మానందం. ఆయన తేనెటీగ లాంటి మనిషి. అన్ని ప్రాంతాలకు తిరుగుతూ తేనె తీసుకొచ్చి అందరికీ పంచాలనే సంకల్పం ఉన్న మంచి మనిషి అని కొనియాడారు. అందమైన హీరో ఎవరని నన్ను అడిగితే నారాయణమూర్తి పేరు చెబుతాను. అందం అంటే గ్లామర్ కాదు.. మంచి మనసు.
Brahmanandam Key Comments
నాకు తను 40 సంవత్సరాలుగా తెలుసు. నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తారు. ఈ సినిమా కూడా పేద ప్రజల కోసమే తీశారని పేర్కొన్నారు. నారాయణమూర్తి ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన జీవితం మీకు అంకితం. చివరి శ్వాస వరకూ మీకోసం కష్టపడుతూనే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇది ఎంతో అందమైన సినిమా. ఇందులో నిజాలుంటాయి.. బూతులు ఉండవు, జీవితపు లోతులుంటాయి.పెద్ద వాళ్లకు కావాలంటే నాలో అమ్మడానికి చాలా ఉన్నాయి.. కిడ్నీ కూడా ఉంది అంటూ సాగే కొన్ని డైలాగులు వింటే హృదయం కదిలి పోయిందన్నారు బ్రహ్మి. ఈ సినిమాను అందరూ చూడాలి. అర్థం చేసుకోవాలి. సమాజం బరువు మోసే వ్యక్తి నారాయణమూర్తి. ఆయన ఒక శక్తి అని చెప్పారు. 40 సంవత్సరాల కెరీర్‌లో ఎంతోమంది ఎన్నో ప్రలోభాలు పెట్టినా వాటికి తలొంచలేదు. నాకు వెంకటేశ్వరస్వామి అంటే ఇష్టం.. నారాయణమూర్తి అంటే ఇష్టం అని పేర్కొన్నారు.
Also Read : Ratan Tata New Innovation Hub : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం


















